వేములవాడలో ఆషాఢమాస బోనాల సందడి

వేములవాడలో ఆషాఢమాస బోనాల సందడి

వేములవాడ/నస్పూర్/మంథని/నిర్మ ల్/​బోయినిపల్లి, వెలుగు: ఆషాడమాస బోనాల సందడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి సంక్షేమ సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనమెత్తారు. అమ్మవారికి పూజలు చేసి ప్రజలపై అమ్మవారి కటాక్షం ఉండాలన్నారు.  

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గంగపుత్రుల గంగాదేవి బోనాల వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి బోనమెత్తారు. నస్పూర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలో పోచమ్మ తల్లికి మేయర్ ధరణి మధుకర్, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ బోనమెత్తి మొక్కులు సమర్పించారు.

బోయినపల్లిలో పద్మశాలి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్​లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వ హించారు. పెద్దపల్లి జిల్లా బొక్కల వాగులో రజకులు తమ కులదైవమైన శ్రీ మడేలయ్య స్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా తరలివెల్లి పెద్ద పోచక్క తల్లిని దర్శించుకొని బోనాలు సమర్పించారు.